Skip to main content

ఆచారం మూఢనమ్మకం కాదు.


ఆచారం సైన్స్ కు అందని విజ్ఞానం.

*మైల కి ఆంగ్ల పదం Quarantine*


పూర్వం పురుడు వచ్చినా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించినా ఆశౌచం(మైల) పాటించేవారు. ఈ విధానం భారతీయ సనాతన ధర్మం ప్రతిపాదించింది. దానిని చాదస్తం లేదా మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నాం. దానిని విశ్లేషిస్తే ఒక వాస్తవం వెలుగు చూస్తోంది. అదేమిటంటే:

ఒక ఇంటిలో శిశువు జన్మిస్తే, ఆ సమయములో తల్లి గర్భము నుంచి కలుషిత వ్యర్ధాలు అనగా నెత్తురులాంటివి అనేకం వెలువడతాయ్. అవి వాతావరణములో అనేక  హానికారక సూక్ష్మజీవులు(వైరస్) ఉత్పత్తికి దోహదం చేస్తాయి ఆ పరిసర ప్రదేశాలలో అనగా ఆ ఇంటిలో లేదా ఆ గదిలో. ఆ యజమానికి సంబంధించిన దగ్గరి(అన్నదమ్ముల కుటుంబాలు) బంధువులు పరామర్శకి(చెడు అర్ధాన్ని ఆపాదించకండి) వచ్చి అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అటువంటి వారిని ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సాధారణముగా వైరస్ జీవన ప్రమాణం 10 రోజులు. అందుకే 11వ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిపిన నీటితో సంపూర్ణ స్నానం చేయాలి అక్కడి వస్తువులన్నీ పసుపు(క్రిమి సంహారిణి) కలిపిన నీటితో శుద్ధి చెయ్యాలి అన్నారు. దీనినే పురిటి శుద్ధి అన్నారు.

ఇక మరణశౌచం అనగా మరణం కారణముగా ఏర్పడే మైల:

మనం గమనిస్తే మరణించిన మానవ శరీరం చుట్టూ క్షణాలలో చీమలు అపరిమితముగా గుమిగూడుతుంటాయ్. వాతావరణములో మార్పుల కారణముగా కనపడని సూక్ష్మజీవులు ఇంకెన్ని కోట్లలో ఆ ప్రదేశములో గుమిగూడతాయో చెప్పలేము. ఆ సమయములో ఆ ఇంటిపేరువారు (జ్ఞాతులు) అక్కడికి వచ్చి ఉండడం జరుగుతుంది. పైన చెప్పినట్లుగానే సూక్ష్మజీవులు జీవనప్రమాణం ఆధారంగా 11వ రోజు శుద్ధి స్నానం చేయమంది శాస్త్రం. జ్ఞాతులు కానివారిని(పెండ్లి అయిన ఆడబడుచులను ఇత్యాది వారిని) 4వ రోజున శుద్ధి స్నానం చేయమంది. కారణం వారు సాధారణముగా వారి నిజావాసాలకు చేరతారు శవ దహనం తరువాత. అంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం ఉండే స్థానాలకు తిరిగి వెళ్లిపోయేరు కాబట్టి *3 రోజులు మైలగా పరిగణించారు. అదే విధముగా శవం ఉన్న సమయములో చుట్టుపక్కల వంట వంటి కార్యక్రమాలు నిషేధించి ఆ ప్రాంతము నుంచి శవం తొలగించిన తరువాత అక్కడి నివాసులు స్నానం చేసి వంట భోజన కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఈ విధానాన్ని *భారతీయ సనాతన ధర్మం ఆశౌచం లేదా మైల అన్నది*

i

అంటే అలనాడు చెప్పిన *మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటేగా. ఆంగ్లములో చెబితే ఇంపు-భారతీయములో చెబితే చాదస్తం. అంతేగా. గమనించండి భారతీయత ఔన్నత్యం*

శుభం భూయాత్.

Comments

Popular posts from this blog

Caronavirus preventive నియమాలు: జూనియో NTR ,మరియు Charan నోటి వెంట....

నిజం చెదుగానే వుంటుంది.?

నిజం చేదుగానే ఉంటుంది.మందు చేదుగానే వుంటుంది, మింగితే రోగం తగ్గుతున్నది.అలాగే 8చేదునిజం జీవితాన్ని మార్చుతున్నది. కొంత కాలం క్రితం వారకూ భారతీయులకు మూఢనమ్మకాలు ఎక్కువ, శాస్త్రవిజ్ఞానం సున్నా,ఆచారాల పేరుతో పిచ్చిపనులు చేస్తుంటారు ఇలా ఎన్నోవాఖ్యానాలు వినిపించేవి. కాలం మారుతున్నది,సనాతన ధర్మం శాస్త్రీయత ఏమిటో అర్థమైయ్యే పరిస్థితులు చుట్టూ జరుగుతున్నాయి.సనాతన ధర్మం గొప్పతనం అంగీకరించాల్సి వస్తున్నది. 1.ఎంగిలి తినవద్దు అంటే వేటకారం చేశారు. 2.కాళ్ళు కడుగుకొని ఇంటిలోకి వెళ్లమంటే వెక్కిరించారు. 3.నమస్కారం పెడితే నవ్వారు. 4.హోమం చేస్తే నేయి వృధా చేస్తున్నారని విమర్శలు 5.ఇప్పుడు దేశాధినేతలే భారతీయ సంప్రదాయాలను అనుసరించమని మీటింగ్ పెట్టి  చెబుతున్నారు. 6.ప్రకృతిని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు తెలుస్తున్నది. 7. చావుభయంతో మృత్యంజయ మంత్రాన్ని పట్టిస్తున్నారు.

Mayday, మేడే నేడే.